నాగార్జున, నాగచైతన్యలు ఇద్దరూ కలిసి ఓ సినిమాలో నటిస్తే ఇక అభిమానులకు పండుగ కాక ఇంకేముంటుంది. గతంలో కూడా నాగార్జున అక్కినేని నాగేశ్వరరావుతో కలిసి ‘ఇద్దరూ-ఇద్దరే’, ‘కలెక్టర్ గారి అబ్బాయి’, ‘అగ్నిపుత్రుడు’ వంటి చిత్రాలలో నటించారు. లేటెస్ట్‌గా నాగచైతన్యతో కలిసి నాగార్జున ఓ చిత్రంలో నటిస్తున్నారనే వార్త సినీవర్గాలలో వినిపిస్తోంది . నాగార్జునతో గతంలో ‘గగనం’ లాంటి ప్రయోగాత్మక చిత్రాన్ని రూపొందించిన రాధామోహన్ ఒక మంచి కధ తో ఈ తండ్రీకొడుకులనిద్దరినీ ఒప్పించాడని...‘గౌరవం’ వర్కింగ్ టైటిల్‌గా అనుకుంటున్నారట. కాగా అక్కినేని నాగేశ్వరరావు, నాగార్జున, నాగచైతన్యలతో ఓ చిత్రాన్ని రూపొందించడానికి దర్శకుడు కృష్ణవంశీ స్టోరీని, స్క్రిప్ట్‌ను రెడీ చేసుకుంటున్నట్లు గత కొంతకాలంగా వార్తలు షికార్లు చేస్తున్నాయి.
బాలనటిగా చిత్రరంగప్రవేశం చేసి ‘సఖి’ చిత్రంతో నాయికగా మారి అనేకమంది అభిమానులను సొంతం చేసుకున్న షాలిని, ఆ తర్వాత పెళ్లి చేసుకుని చిత్రసీమకు గుడ్‌బై కొట్టింది. ఇన్నాళ్లు ఇల్లే వైకుంఠంగా జరిగిపోయిన ఆమె కాలం మళ్లీ వెనక్కు తిరుగుతోందట. ఇటీవల గృహిణిగా ఓ వంట ఇంటి సామగ్రికి మోడల్‌గా నటిస్తూ యాడ్ ఫిలిం చేసింది. ఈ యాడ్ ఫిలిం చేసేటప్పుడు తన పాతరోజులు గుర్తొచ్చాయట అమ్మడికి. దీంతో తాను చాలా పోగొట్టుకున్నానంటూ బాధపడిపోతోందట. మళ్లీ అవకాశాలు ఎవరైనా ఇస్తే బాగుండునన్న ఆలోచనలో పడిపోయింది. కనీసం హీరోయిన్‌గా కాకపోయినా కీలకమైన పాత్రలు ఏమిచ్చినా చేస్తానంటూ స్టేట్‌మెంట్లు ఇస్తోంది. వదిన, అక్క, తల్లి పాత్రలు తప్ప మరేదైనా చేస్తుందట. కొంపదీసి చిట్టచివరికి హీరోయిన్ పాత్రలే చేస్తాననదు కదా

No comments:
Post a Comment