చింతకాయల రవి' చిత్రం తర్వాత 'విక్టరి' వెంకటేష్ నటించిన చిత్రం 'ఈనాడు'. కమలహాసన్ కూడా నటించిన ఈ చిత్రం సెపెంబరు మొదటి వారంలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదిలా వుండగా తాజాగా వెంకటేష్ అమ్మా రాజశేఖర్ దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తున్న సంగతి తెలిసింగదే. విశ్వసనీయ కథనం ప్రకారం ఈ చిత్రానికి 'గంగ' అనే టైటిల్ ను ఖరారు చేసినట్టు తెలిసింది.
ప్రస్తుతం తోట తరణి ఆద్వర్యంలో ఈ చిత్రానికి సంభందించి ఓ భారీ సెట్ హైదరాబాదు సివార్లలో నిర్మాణం జరుపుకొంటోంది. ఇలియానా ఇందులో కథానాయికగా నటించే అవకాశం వుంది. ప్రస్తుతం 'నమో వెంకటేశా' చిత్రంతో బిజీగా వున్న వెంకటేష్ , ఆ చిత్రం తర్వాత ఈ చిత్రం షూటింగ్ లో పాల్గొనే అవకాశం వుంది.