Upcomming Movies

Sunday, July 31, 2011

ముంబైలో నయనతార-ప్రభుదేవా వివాహం




కోలీవుడ్ ప్రేమ జంట ప్రభుదేవా-నయనతారల వివాహం దేశ వాణిజ్య రాజధాని ముంబైలో జరుగనుంది. ప్రస్తుతం దక్షిణాదిలోని టాప్ హీరోయిన్లలో నయనతార ఒకరుగా చెలామణి అవుతున్నారు. అలాగే, ప్రభుదేవాకు కూడా మంచి క్రేజ్ ఉంది. అదేసమయంలో తన భార్య రమలతకు ప్రభుదేవా విడాకులు ఇచ్చిన విషయం తెల్సిందే. ఇందుకోసం ఆయన పెద్ద పోరాటమే చేయాల్సి వచ్చింది. 

ఇలాంటి పరిస్థితుల్లో నయన-ప్రభుల వివాహం దక్షిణ భారతదేశంలోని ఏ ప్రాంతంలో జరిగినా.. దానికి మీడియా అధిక ప్రాధాన్యత ఇస్తుంది. అందులో ఏ చిన్నపాటి సంఘటన జరిగినా దాన్ని హైలెట్ చేసే అవకాశాలు లేకపోలేదు. ఇలాంటి వివాదాస్పద విషయాలు చోటు చేసుకోకుండా ఉండేందుకు వీలుగా పెళ్లిని మాత్రం ముంబైలో జరుపుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. 

ప్రస్తుతం అక్షయ్ కుమార్, సోనాక్షీ సిన్హా హీరో హీరోయిన్లుగా "రౌడీ రాథోర్" అనే చిత్రానికి ప్రభుదేవా దర్శకత్వం వహిస్తూ ముంబైలోనే ఉంటున్నారు. దీంతో వివాహం కూడా అక్కడే జరుపుకోవాలని నిర్ణయించుకున్నారు.

BidVertiser

Followers