Upcomming Movies

Saturday, July 21, 2012

రోహిత్ ‘మద్రాసి

బాణం, సోలో చిత్రాలతో కథానాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్న యువ హీరో నారా రోహిత్ హీరోగా వెంకట సూర్యతేజ ప్రొడక్షన్స్ పతాకంపై ప్రారంభమైన చిత్రం ‘మద్రాసి’. రవి వల్లభనేని నిర్మిస్తున్న ఈ చిత్రానికి విజయ్ లింగమనేని దర్శకుడు. హైదరాబాద్ మాదాపూర్ అవధాన సరస్వతి పీఠంలో ముహూర్తపు సన్నివేశానికి బెల్లంకొండ సురేష్ క్లాప్ ఇవ్వగా, మాడుగుల నాగఫణిశర్మ కెమెరా స్విచాన్ చేశారు. తొలి సన్నివేశానికి సాగర్ గౌరవ దర్శకత్వాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కథానాయకుడు నారా రోహిత్ మాట్లాడుతూ డిఫరెంట్ రివెంజ్ ఫార్మాట్‌లో నిర్మిస్తున్న ఈ కథకు స్క్రీన్‌ప్లే సరికొత్తగా కుదిరిందని, దర్శకుడు గత రెండు సంవత్సరాలుగా ఈ కథకు మంచి ట్రీట్‌మెంట్ ఇచ్చారని, కథ బాగా నచ్చి ఈ చిత్రంలో నటిస్తున్నానని తెలిపారు. ఎమోషన్‌తో కూడిన ఈ కథలో నారా రోహిత్ పాత్ర సరికొత్తగా వుంటుందని, యాక్షన్ డ్రామా ఎంటర్‌టైన్‌మెంట్‌తో రూపొందుతున్న ఈ చిత్రం ఆగస్టునుంచి అండమాన్, గుజరాత్, ఢిల్లీ, హైదరాబాద్‌లలో రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుందని, నిర్మాత రవి వల్లభనేని తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: రాధన్, కెమెరా: అరవిందన్ పి.గాంధి, ఆర్ట్: మురళి కొండేటి, నిర్మాత: రవి వల్లభనేని, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: విజయ్ లింగమనేని.

BidVertiser

Followers