Upcomming Movies

Wednesday, September 2, 2009

'జోష్' టైం


ప్రస్తుతం వున్న సినిమాల్లో మగధీర మినహా మరే సినిమా ప్రేక్షకులని థియేటర్లకి తీసుకురాలేకపోతున్న తరుణంలో, మరో మూడు రోజుల్లో రాబోతున్న 'జోష్' సినిమా పైనే అందరి దృష్టి నిలచింది. ఈ సినిమా తెలుగు సినిమా మార్కెట్ కు 'జోష్'ను ఇస్తుందని అందరూ ఆశిస్తున్నారు.

నాగార్జున తనయుడి తొలి చిత్రం, అపజయమెరుగని 'దిల్' రాజు బ్యానర్ నుండీ ఈ చిత్రం వస్తుండటంతో ఈ సినిమా పై భారీగా అంచనాలు వున్నాయి. అందుకు తగ్గట్టుగానే 'జోష్'ని భారీ స్థాయిలో విడుదల చెయ్యబోతున్నారు 'దిల్' రాజు. హైదరాబాదులో తొలి రోజుకు ఇప్పటి వరకూ 44 థియేటర్లు సిద్ధమయ్యాయి. మొత్తం మీద 50 థియేటర్లలో విడుదల చెయ్యాలని చూస్తున్నారు 'దిల్'రాజు. ఒక కొత్త హీరో చిత్రం ఇంత భారీగా విడుదలవ్వడం రికార్డు.

ఇక అంచనాలకు తగ్గట్టుగా ఈ సినిమా వుంటే ఓపెనింగ్స్ లోనూ ఈ సినిమా రికార్డు నెలకొల్పే అవకాశం వుంది.

పవన్ కళ్యాణ్ కి జన్మదిన శుభాకాంక్షలు


జయాపజయాలు వెలుగూ చీకటిలాంటివి! అది గ్రహించినవాడు విజయాన్ని తనవైపు ఈజీగా తిప్పుకొగలడు. కష్టపడే వాడు కార్యదీక్షత కలిగినవాడు చేసే పని అదే. పవన్ కళ్యాణ్ ది సరిగ్గా అటువంలటి పర్సనాలిటీయే. ప్రారంభంలో వరుసగా హిట్లు చూసి, తర్వాత కొన్ని జయాపజయాలను చవిచూనిన పవన్ మళ్ళీ ఇప్పుడు హిట్ రేసులో పరుగెడుతున్నారు.పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ జన్మదినం నేడు(సెప్టెంబర్ 2) ఎలాంటి హంగూ ఆర్భాటం లేకుండా జన్మదిన వేడుకలకు దూరంగా ఉండటం పవన్ కళ్యాణ్ కి అలవాటు. అభిమానులపై అభిమానం ఉన్నప్పటికీ బర్త్ డే పేరుతో వారికి ఆహ్వానాలు పలకడం పవన్ కి ఇష్టం ఉండదు. ఆయన సినిమాలకు శతదినోత్పవవేడుకలు చేయరు ఎందకంటే ఆయనకు సినిమా విజయం ఆనందాన్నిస్తుంది కానీ, ఆ ఆనందాన్ని పంచుకోవడానికి వేడుక ఏర్పాటు చేస్తే అందులో పాలుపంచుకోవడానికి అభిమానులు ఎక్కడెక్కడి నుండో వ్యయప్రయాసలకోర్చి వస్తారు. వారిని ఇబ్బందిపెట్టడం ఇష్టం లేదంటారు.

రియల్ లైఫ్ లోనూ కూల్ గా వ్యవహరింగడం కళ్యాణ్ స్టయిల్. తన లైఫ్, తన సినిమాలు తప్ప ఇంకొకరి గురించి ఆలోచించడం ఆయనలో ఉండదు. పైకి కఠినమైన వ్యక్తిలా కనిపించే పవన్ కళ్యాణ్ మనసు సున్నితం అని చెప్పడానికి ఇదోక నిదర్శనంగా చెప్పుకోవచ్చు. మెగాస్టార్ తమ్ముడుగా జన్మించిన ఈ పవర్ స్టార్ అనతికాంలోనే అసంఖ్యాక తెలుగు ప్రజల అభిమానాన్ని చూరగొని ఆ ‘అన్నయ్య’ కు తగ్గ తమ్ముడ’గా అఖిలాంద్రకోటి ప్రజల హృదయసంహాసనాధినేత కాగలిగాడు.

ఇంతింతై...నటుడింతై.....తానంతై...భూమికంతంతై అన్న చందాన, ఇంత వాడైన కళ్యాణ్ అంతవాడైన పవర్ స్టార్ గా ఎదిగిన వైనాన్ని, ఆయన విజయపరంపరను ఒక్కసారి అధ్యయనం చేస్తే...ఆయన మొదటి సినిమా గీతా ఆర్ట్స్ పతాకంపై ఇవివి సత్యనారాయణ నిర్థేశకత్వంలో అగ్ర నిర్మాత అల్లు అరవింద్ నిర్మించిన ‘అక్కడ అబ్బాయి-ఇక్కడ అమ్మాయి’ అక్కినేని మనుమరాలు సుప్రియ, పవన్ కాంబినేషన్లో నిర్మించిన ఈ చిత్రం మంచి విజయం సాధించింది. ఆయన రెండవ చిత్రం మత్యాలసుబ్బయ్య దర్శకత్వంలో ‘గోకులంలో సీత’ నటుడిగా ఆయన తొలి విజయం అని చెప్పుకొవాలి. ఇక పవర్ స్టార్ కెరీర్లో మైల్డ్ స్టోన్ గా నిలిచిన చిత్రం కరుణాకరణ్ ‘తొలిప్రేమ’ ఈ చిత్రం ఒక హిస్టరీని క్రియేట్ చేసింది.

ఈ సినిమాలో పవర్ స్టార్ నటనకు తెలుగు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. తర్వాత వచ్చిన సినిమాలు తమ్ముడు, బద్రి, ఖుషి లాంటి సినిమాలు విజయపతాకాన్ని ఎగురవేశాయి. కానీ తర్వాత తన ఆలలోచనలకి రూపంగా దర్శకునిగా రూపాంతరం చెంది తను తీర్చిదిద్దిన చిత్రం ‘జానీ’ ఈ చిత్రం అనుకున్నంత సక్సెస్ ను సాధించలేకపోయింది. తరువాత ఆయన నటించిన గుడుంబా శంకర్, బాలు, బంగారం, అన్నవరం చిత్రాలు ఆయన స్థాయికి తగ్గ విజయాలను సాధించలేక పోయాయి. కానీ ‘జల్సా’ సినిమా సంచలనం సాధించింది. ఇదే రేస్ లో ఇప్పుడు అభిమానులందరూ ‘కొమరం పులి’ కోసం వేయి కళ్ళతో ఎదుదుచూస్తున్నారు. నువ్వే నువ్వే, అతడు లాంటి ట్రమండస్ హిట్స్ తెలుగు ప్రజలకు అందించిన యువదర్శక, రచయిత త్రివిక్రమ శ్రీనివాస్ దర్శకత్వ సారధ్యంలో సవర్ స్టార్ ఖ్యాతిని నవఖండ....భూమండలమంతా ప్రతిధ్వనించాలని...తెలుగు వాడినీ ప్రపంచవ్యాప్తంగా చాటిచెప్పాలని, సెప్టెండర్ 2న జన్మదినం జరుపుకుంటున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో telugua1movies.blogspot.com b'day wishes

శ్రీనువైట్ల దర్శకత్వంలో మహేష్



ప్రిన్స్ మహేష్ బాబు ఎట్టకేలకు తన అభిమానులకు ఇచ్చిన మాట నిలుపుకొనేందుకు సన్నద్ధమవుతున్నారు. ఏటా కనీసం రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తానని గతంలో చెప్పిన మహేష్ ఆ మాట నిలబెట్టుకోలేదు. ఇటీవల జరిగిన థమ్స్ అప్ ప్రచార కార్యక్రమంలో మహేష్ ఇందుకు విచారం వ్యక్తం చేస్తూ ఇక నుంచి తన మాటకు కట్టుబడి ఉంటానని చెప్పి అభిమానులకు ఊరట కలిగించారు. అందులో భాగంగానే తన తదుపరి చిత్రంగా శ్రీనువైట్ల దర్శకత్వంలో పనిచేసేందుకు మహేష్ సూత్రప్రాయంగా అంగీకరించినట్టు టాలీవుడ్ వర్గాల తాజా వార్త .

దర్శకుడు శ్రీనువైట్ల 'ఢీ', 'రెడీ', 'కింగ్' వంటి వరుస విజయాలతో దూసుకుపోతున్నారు. ప్రస్తుతం వెంకటేష్ కథానాయకుడుగా రూపొందుతున్న 'నమో వెంకటేశ' చిత్రానికి ఆయన దర్శకత్వం వహిస్తున్నారు. మహేష్ సైతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో 'వరుడు' (వర్కింగ్ టైటిల్) చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం తర్వాత ముందుగా అనుకున్న ప్రకారం గౌతమ్ మీనన్ దర్శకత్వంలో ఓ చిత్రంలో నటించాలని మహేష్ అనుకున్నప్పటికీ కారణాంతరాల వల్ల గౌతమ్ మీనన్ ఇప్పుడు నాగచైతన్య రెండో చిత్రానికి దర్శక పగ్గాలు చేపట్టారు. ఈ నేపథ్యంలో 'వరుడు' తర్వాత శ్రీనువైట్లతో పనిచేసేందుకు మహేష్ ఆసక్తి కనబరిచినట్టు తెలుస్తోంది. మహేష్-వైట్ల కాంబినేషన్ చిత్రాన్ని ఓ అగ్రనిర్మాత ఒకరు నిర్మించనున్నారు. 2010 సంక్రాంతి కానుకగా మహేష్ 'వరుడు', శ్రీనువైట్ల 'నమో వెంకటేశా' రిలీజ్ కానున్నారు. ఆ వెనువెంటనే ఈ ఇద్దరి కాంబినేషన్ చిత్రం ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి.

BidVertiser

Followers