Upcomming Movies

Showing posts with label శ్రీనువైట్ల దర్శకత్వంలో మహేష్. Show all posts
Showing posts with label శ్రీనువైట్ల దర్శకత్వంలో మహేష్. Show all posts

Wednesday, September 2, 2009

శ్రీనువైట్ల దర్శకత్వంలో మహేష్



ప్రిన్స్ మహేష్ బాబు ఎట్టకేలకు తన అభిమానులకు ఇచ్చిన మాట నిలుపుకొనేందుకు సన్నద్ధమవుతున్నారు. ఏటా కనీసం రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తానని గతంలో చెప్పిన మహేష్ ఆ మాట నిలబెట్టుకోలేదు. ఇటీవల జరిగిన థమ్స్ అప్ ప్రచార కార్యక్రమంలో మహేష్ ఇందుకు విచారం వ్యక్తం చేస్తూ ఇక నుంచి తన మాటకు కట్టుబడి ఉంటానని చెప్పి అభిమానులకు ఊరట కలిగించారు. అందులో భాగంగానే తన తదుపరి చిత్రంగా శ్రీనువైట్ల దర్శకత్వంలో పనిచేసేందుకు మహేష్ సూత్రప్రాయంగా అంగీకరించినట్టు టాలీవుడ్ వర్గాల తాజా వార్త .

దర్శకుడు శ్రీనువైట్ల 'ఢీ', 'రెడీ', 'కింగ్' వంటి వరుస విజయాలతో దూసుకుపోతున్నారు. ప్రస్తుతం వెంకటేష్ కథానాయకుడుగా రూపొందుతున్న 'నమో వెంకటేశ' చిత్రానికి ఆయన దర్శకత్వం వహిస్తున్నారు. మహేష్ సైతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో 'వరుడు' (వర్కింగ్ టైటిల్) చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం తర్వాత ముందుగా అనుకున్న ప్రకారం గౌతమ్ మీనన్ దర్శకత్వంలో ఓ చిత్రంలో నటించాలని మహేష్ అనుకున్నప్పటికీ కారణాంతరాల వల్ల గౌతమ్ మీనన్ ఇప్పుడు నాగచైతన్య రెండో చిత్రానికి దర్శక పగ్గాలు చేపట్టారు. ఈ నేపథ్యంలో 'వరుడు' తర్వాత శ్రీనువైట్లతో పనిచేసేందుకు మహేష్ ఆసక్తి కనబరిచినట్టు తెలుస్తోంది. మహేష్-వైట్ల కాంబినేషన్ చిత్రాన్ని ఓ అగ్రనిర్మాత ఒకరు నిర్మించనున్నారు. 2010 సంక్రాంతి కానుకగా మహేష్ 'వరుడు', శ్రీనువైట్ల 'నమో వెంకటేశా' రిలీజ్ కానున్నారు. ఆ వెనువెంటనే ఈ ఇద్దరి కాంబినేషన్ చిత్రం ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి.

BidVertiser

Followers