Title : Mallanna *ing : Vikram and Shriya Saran Music : Devisri Prasad Producer : Kalaipuli S Thanu Director : Susi Ganeshan
విక్రమ్ సినిమాలు ఎలా వుంటాయి? అతని పాత్రలు ఎలా ఉంటాయి? అనే క్రేజ్ ప్రేక్షకుల్లో నెలకొంది. ఆయన నటించే చిత్రాలలో సందేశంతోపాటు కాస్త సీరియస్నెన్నుకూడా జోడింపుగా ఉంటాయి. అవినీతిని, అన్యాయాన్ని ఎదురించే సూపర్మ్యాన్లా ఆయన గత చిత్రాలు నిలిచాయి. అపరిచితుడు అటువంటి కోవలోనిదే. కానీ మల్లన్న చిత్రం మాత్రం కాస్త అటూ ఇటూగా… అర్జున్ నటించిన జెంటిల్మెన్, మెగాస్టార్ నటించిన ‘ఠాగూర్’ చిత్రాల కలగలిపి అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో తీసిన చిత్రంలా కనబడుతుంది.
విక్రమ్ చిత్రాలంటేనే అన్యాయాలను ఎదిరించే పాత్రలని ఇట్టే తెలిసిపోతుంది. అలా ఎదిరించే మల్లన్న సి.బి.ఐ. కార్యాలయంలో అవినీతి నిరోధక శాఖలో అధికారి. అతని పై ఆఫీసర్ అంటే సిబిఐ జాయింట్ డైరెక్టర్ కృష్ణ. ఆర్థిక నేరాలకు సంబంధించిన కేసులను పర్యవేక్షించే బాధ్యతను మల్లన్నకు అప్పగిస్తాడు. మిన్ను విరిగి మీద పడ్డా అతి సాధారణంగా తీసుకునే రకం మల్లన్నది.
శ్రీశైలం ఊరిలో ఈశ్వరుని కొలుస్తుంటారు. ఏ సమస్యలొచ్చినా ఆయనకు విన్నవించుకుంటారు. గుడిలో చెట్టుకు తమ సమస్యలను రాసి కడితే పరిష్కారమవుతాయని వారి నమ్మకం. తన తండ్రి ఆపరేషన్కు డబ్బులుకావాలనీ, తమ పిల్ల పెండ్లికి డబ్బులు కావాలనీ, పొలాన్ని కబ్జా చేస్తున్నారనీ ఇలా రకరకాల సమస్యలతో కాగితాలు కడతారు. వాటిని మల్లన్న మారువేషంలో వచ్చి వాటిని పరిష్కరిస్తుంటాడు. అందుకు ఆయన ఎన్నుకున్న మార్గం గబ్బిలం లాంటి డ్రెస్తో కోడిపుంజు మాస్క్తో వింతగా కన్పిస్తాడు.
పోలీసు అధికారుల్లో అవినీతిని కూడా దేవుడి సెంటిమెంట్తో అరికడతాడు. మల్లన్న తనకున్న టీమ్ సభ్యులతో రాష్ట్రంలో ఎక్కడెక్కడ కోటీశ్వరులన్నారో లిస్ట్ తయారుచేస్తారు. ఆ క్రమంలో లెక్కలేనంత సంపాదించిన పల్నాటి పరంజ్యోతి పాపారావు (పిపిపి) అని పిలవడే (ఆశిష్విద్యార్థి) ఇంటిపై దాడిచేస్తాడు మల్లన్న. అక్రమంగా సంపాదించిన డబ్బును పట్టుకునే సమయానికి ఢిల్లీ నుంచి హోం మంత్రి ఫోన్ చేయడంతో వెనక్కు తగ్గుతాడు.
అప్పుడే ఇటలీలోవున్న అతని కుమార్తె సుబ్బలక్ష్మి (శ్రియ)తో ఫోన్లో మాట్లాడతారు. చిన్న విషయానికి హడావుడి చేసే తత్త్వం ఆమెది. ఆ తర్వాత ఇండియా వచ్చి తన తండ్రి పక్షవాతానికి లోనయినట్లు తెలుసుకుని ఇందుకు కారణమైన మల్లన్నపై పగసాధించుకోవాలని నిర్ణయించుకుంటుంది. తండ్రినుంచి పర్మిషన్ తీసుకుని ప్రేమ పేరుతో మల్లన్న ఆటకట్టించాలని ప్రయత్నిస్తుంది.
సుబ్బలక్ష్మి విషయం టీమ్సభ్యులకు నచ్చకపోయినా తనూ ప్రేమిస్తున్నట్లు నటిస్తానని చెబుతారు. ఆ క్రమంలో పేదల కష్టాలు తీర్చే మల్లన్న దేవుడు కాదు.. ఈ మల్లన్నే అని విషయాన్ని గ్రహించి పట్టుకునేట్లు చేస్తుంది. మరోవైపు టాస్క్ఫోర్స్ అధికారి ప్రభు మల్లన్న ఎవరు అనే విషయంపై ఆరాతీస్తుంటాడు. ఆ క్రమంలో మల్లన్న దేవుడుకాదు. మనిషే అని గ్రహిస్తాడు. మల్లన్నను పట్టుకోవాలని చూస్తాడు.
ఆ తర్వాత విదేశీ బ్యాంక్లో కోట్లాది రూపాయలను ఉన్న పెద్ద చేపను పట్టేందుకు మెక్సికో వెళతాడు మల్లన్న. దీనికి పి.పి.పి. దొంగపాస్పోర్టుతో సహకరిస్తాడు. ఆ డీల్ ఓకే అయితే 50-50 అని పి.పి.పి. చెబుతాడు. అందుకు అక్కడ డబ్బు బ్యాంక్లో జమచేయాలంటే.. పర్సనల్ కోడ్ కావాలి గనుక మల్లన్నతోపాటు తన కూతురును పంపిస్తాడు. అలా వెళ్ళిన సుబ్బలక్ష్మి ప్రేమలో నిజంగానే పడుతుంది.
మరి అక్కడి నల్లధనాన్ని ఎలా ఇండియాకు తీసుకొచ్చాడు? టాస్క్ఫోర్స్ అదికారి మల్లన్నను పట్టుకున్నాడా? ఆ తర్వాత ఏమయింది? అనేది సినిమా.
కథ నిడివి 3 గంటలకుపైగా ఉంది. విక్రమ్ తన పాత్రకు న్యాయం చేసినా కోడిపుంజు తరహాలో ఆయన చేసిన చేష్టలు శృతిమించాయి. ఏదో కొత్తదనం కోసం చేసినట్లుందికానీ ప్రేక్షకుడ్ని పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. శ్రియ తన అందాలను చక్కగా ఆరబోసింది. బాత్రూమ్లో పాడే పాటలో చాలా సెక్సీగా నటించింది. ‘అలెగ్రా.. అలెగ్రా.. పాట, ‘ఎక్స్క్యూజ్మి.. మిస్టర్ మల్లన్న ‘పాటలు ఆకట్టుకున్నాయి. దేవీశ్రీప్రసాద్ సంగీతం కొత్తదనం లేకపోయినా బాగానే ఉన్నాయి. ముమైత్ఖాన్, విలన్ మధ్యసాగే పాట ‘పచ్చగడ్డి కోసే పడుచుపిల్ల…’ తో కొత్తప్రయోగం చేసినా రీమిక్స్ అంతగా ఆకట్టుకోలేకపోయింది.
ముఖ్యంగా విక్రమ్ తన పాటలను తనే పాడుకోవడం సూటయింది. ప్రజలకు మేలు చేసే క్రమంలో వృద్ధుడి పాత్రలోనూ, ఐశ్వర్యారాయ్ కావాలని తుంటరి చెట్టుకు కాగితం రాసే సందర్భంలో అమ్మాయి పాత్ర ద్వారా బుద్ధి చెబుతాడు. ఏది చేసినా తన టీమ్తో కలిసి టెక్నాలజీ ఉపయోగించి పైకి ఎగరటాలు చేస్తుంటాడు. ఇక మెక్సికోలో నల్లడబ్బును మార్చుకోవడం… దాన్ని డీ కోడ్ చేయడం వంటి విషయాలు సామాన్యునికి ఏమాత్రం అర్థంకావు.
సీరియస్గా సాగే ఈ చిత్రంలో స్పీడ్ బ్రేక్లా బ్రహ్మానందం కామెడీ ఉంది. చిత్రానికి ఏమాత్రం ఉపయోగంలేని ఎపిసోడ్ అది. దాన్ని కట్ చేస్తేనే సినిమాకు ఉపయోగం. సంభాషణలు ఆకట్టుకున్నాయి. 50 రూపాయలకోసం ఎన్నో కష్టాలు పడి మనిషి సుఖం కోసం చాలానే ఖర్చు చేస్తాడు. 30 లక్షలిచ్చి ముమైత్ఖాన్ వంటి అమ్మాయితో ఎంజాయ్ చేసే బదులు ఆ డబ్బుతో మూడు గ్రామాలను దత్తత తీసుకోవచ్చు. కొన్ని వందల మందిని బతికించవచ్చు… అనే లాజిక్లు బాగున్నాయి.
కృష్ణకు, ప్రభుకు మధ్య జరిగే సంభాషణలు ఆసక్తికరంగా ఉంటాయి. 41 సర్వీస్లో చేయలేని పనిని… మల్లన్న చేసి ఎలా ప్రజలకు దేవుడయ్యాడనేది లాజిక్కుగా ఉంది. ఒకరికి పీకలదాకా డబ్బుంటే.. మరొకరికి పీకకోస్తే డబ్బు… నిజమైన స్వాతంత్య్రం విదేశీయులనుంచి పొందామనేది కరెక్ట్కాదు. స్వదేశంలో దోచింది విదేశాల్లో కూడబెడుతూ అరాచక కార్యకలాపాలకు కారణమవుతున్న వారినుంచి మనకు స్వాతంత్య్రం రావాలన్న పాయింట్కు క్లాప్స్ పడ్డాయి.
ఇక సాంకేతిక పరంగా విజువల్ ఎఫెక్ట్స్ బాగా ఉపయోగపడ్డాయి. ఎడిటింగ్లో కాస్త గందరగోళంగా ఉంది. ఏది తియ్యాలో తీయడకూడదనేట్లుగా ఉంది. కామెడీని పూర్తిగా తీయడం, రెండో భాగం నత్తనడకన సాగడం లేకుండా చేస్తే బాగుండేది. అపరిచితుడు రేంజ్లో ఊహించుకుని వచ్చిన ప్రేక్షకుడికి నిరాశే మిగులుతుంది. కోట్లు ఖర్చుపెట్టి పాత కథల్నే తీయడంలా ఉంది. చివరిలో మల్లన్న పట్టుబడ్డా సాక్షం దొరక్క వేరే ఊరికి బదిలీ అవుతాడు. మళ్ళీ అక్కడా ఇదే పరిస్థితి. ఈ సినిమా కూడా ఓపెనింగ్లో విపరీతంగా థియేటర్లు ఎగబడ్డాయి. వారం తర్వాత అందులో చాలా బదిలీ అవుతాయనడంలో సందేహమే లేదు.
http://telugua1movies.blogspot.com
No comments:
Post a Comment