Upcomming Movies

Showing posts with label భీష్మ' లో ఆ హీరోయిన్స్. Show all posts
Showing posts with label భీష్మ' లో ఆ హీరోయిన్స్. Show all posts

Tuesday, July 21, 2009

భీష్మ' లో ఆ హీరోయిన్స్

బాలకృష్ణ, రమేష్ వర్మ కాంబినేషన్లో బెల్లంకొండ సురేష్ నిర్మిస్తున్న భీష్మ చిత్రంలో ముగ్గురు హీరోయిన్స్ చేస్తున్నారు. అందుకోసం నయనతార, భూమిక ఇప్పటికే ఎగ్రిమెంట్ చేసారని తెలుస్తోంది. ఇక మరో యంగ్ హీరోయిన్ కోసం వేట సాగుతోంది. మొదట కొత్త బంగారులోకం భామ శ్వేతాబసు అనుకున్నారు గానీ బాలయ్య ప్రక్కన మరీ చిన్నపిల్లలా ఉంటుందని ఆగారని సమాచారం. ఇక ఈ చిత్రం జూలై 31న హైదరాబాద్ లో గ్రాండ్ గా ప్రారంభం కానుంది. యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రాన్ని రమేష్ వర్మ తీర్చిదిద్దనున్నట్లు సమాచారం.రమేష్ వర్మ,బెల్లంకొండ కాంబినేషన్లో రీసెంట్ గా రైడ్ అనే హిట్ వచ్చిన సంగతి తెలిసిందే.

ఇంతకు ముందు రమేష్ వర్మ..తరుణ్, సలోని జంటగా ఒక ఊరిలో అనే చిత్రాన్ని రూపొందించాడు. అలాగే మల్లెపూవు చిత్రానికి కథ అందించాడు. వీటితో పాటు రమేష్ వర్మ పోస్టర్స్ డిజైనర్ గా మంచి పేరు తెచ్చుకున్న వ్యక్తి. ఇక నయనతార ఎన్టీఆర్ తో అదుర్స్ లో చేస్తోంది. వి.వి.వినాయిక్ డైరక్షన్ లో రెడీ అవుతున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. అలాగే రవితజ సరసన కూడా ఆమె ఆంజనేయులు చిత్రంలో చేస్తోంది. ఆ చిత్రాన్ని యువత దర్శకుడు పరుశరామ్ తీర్చిదిద్దుతున్నాడు. ఇక భూమిక లేటెస్ట్ గా మళయాళంలో బ్రమరం అనే చిత్రంలో మోహన్ లాల్ సరసన చేస్తోంది. అలాగే రాజశేఖర్ తో నా స్టైలే వేరు చిత్రంలో చేసింది. వీటితో పాటు నవదీప్ సరసన చేస్తున్న యోగం షూటింగ్ పూర్తయింది.

BidVertiser

Followers