Upcomming Movies

Showing posts with label పంజా. Show all posts
Showing posts with label పంజా. Show all posts

Wednesday, April 27, 2011

బాలయ్య కొత్త చిత్రం పంజా

బాలకృష్ణ హీరోగా పరుచూరి మురళి దర్శక్వంలో ఎంఎల్ కుమార్ చౌదరి నిర్మిస్తున్న భారీ చిత్రానికి ‘మహదేవనాయుడు’ అనే టైటిల్ పెట్టే ఆలోచనలో ఉన్న సంగతి తెలిసిందే.అయితే తాజాగా బాలకృష్ణ తన చిత్రానికి సింహా లాంటి క్యాచీగా ఉండే పవర్ ఫుల్ టైటిల్ కావాలని అడగటంతో పంజా అనే టైటిల్ ని చెప్పినట్లు దానికి బాలయ్య ఓకే అన్నట్లు తెలుస్తోంది.మహదేవనాయుడు టైటిల్ ని అనుకోవటానికి కారణం అప్పట్లో బ్లాక్ బస్టర్ హిట్ అయిన నరసింహనాయుడు టైటిల్.అయితే ఆ తర్వాత వచ్చిన బ్రహ్మనాయుడు చిత్రం డిజాస్టర్.దాంతో బాలయ్య సెంటిమెంట్ తో ఆలోచించి ఈ నిర్ణయానికి వచ్చినట్లు చెప్తున్నారు.

పరుచూరి మురళి మాత్రం బాలకృష్ణను ఓ కొత్త డైమెన్సన్ లో చూపించే ప్రయత్నం చేస్తున్నాడని తెలుస్తోంది. ఇంతకుముందు బాలకృష్ణ చేసిన క్యారెక్టర్ల కంటే విభిన్నంగా వుండే ఈ క్యారెక్టర్ తప్పకుండా సంచలనం సృష్టిస్తుందని బాలయ్య కూడా నమ్ముతున్నాడు. అయితే పంజా అనే టైటిల్ మాత్రం అఫిషియల్ గా కన్ ఫర్మ్ చేయాల్సి ఉంది.

BidVertiser

Followers