Upcomming Movies

Showing posts with label దసరా రేసులో 'ఓ మై ఫ్రెండ్'. Show all posts
Showing posts with label దసరా రేసులో 'ఓ మై ఫ్రెండ్'. Show all posts

Thursday, June 2, 2011

దసరా రేసులో 'ఓ మై ఫ్రెండ్'

సిద్దార్ధ హీరోగా రూపొందుతున్న చిత్రం 'ఓ మై ఫ్రెండ్'. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ కార్యక్రమాలు హైదరాబాద్లో శరవేగంగా జరుగుతున్నాయి. అలాగే ఈ సినిమాను దసరా పండక్కి విడుదల చేసే సన్నాహాల్లో ఉన్నాడు దిల్ రాజు. ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్న వేణు శ్రీరామ్ సినిమాను అద్బుతంగా తెరకెక్కిస్తున్నాడని దిల్ రాజు ఆనందం వ్యక్తం చేశాడు.

బొమ్మరిల్లు తరవాత సిద్దార్ధ దిల్ రాజు కలయికలో వస్తున్న రెండో చిత్రం 'ఓ మై ఫ్రెండ్'. శృతి హసన్ సిద్దార్ధ సరసన హీరోయిన్ గా నటిస్తుంది. హన్సిక మరో కధానాయకిగా కనిపించనుంది. అర్బన్ రొమాంటిక్ లవ్ స్టోరిగా చెబుతున్న ఆ చిత్రానికి సంగీతం దేవి శ్రీ ప్రసాద్.

ఈ సినిమా తరవాత దిల్ రాజు మరో రెండు సినిమాలు నిర్మించే పనిలో ఉన్నాడు. జోష్ ఫేం వాసు వర్మ దర్శకత్వంలో ఒకటి, కొత్త బంగారు లోకం ఫేం శ్రీకాంత్ అడ్డాల తో ఒక సినిమా చేయటానికి ప్రయత్నాలు చేస్తున్నాడు. ఆ సినిమాలకు కధలు సిద్దంగా ఉన్నప్పటికీ నటి నటుల ఎంపిక జరగవలసి ఉందని తెలిపాడు. అక్టోబర్ లోపు ఈ రెండు సినిమాలు మొదలవుతాయని తెలుస్తుంది.

BidVertiser

Followers