కల్యాణ్ రామ్ హన్సిక Sep 17న విడుదల

Kalyan Ram and hansika
సాధారణంగా తన ప్రతి చిత్రం వివరాలని విడుదల వరకు గోప్యంగా ఉంచే కల్యాణ్ రామ్ ఎక్కడున్నాడు అనుకుంటున్నరా? ప్రస్తుతం ఒక కొత్త చిత్రం లో హాన్సిక తో స్టెప్పులు వేస్తున్నాడు. హరే రామ్ చిత్ర విజయం తర్వాత ఎన్.టి.ఆర్ ఆర్ట్స్ బ్యానర్ లో కల్యాణ్ రాం నిర్మిస్తూ నటిస్తున్న మూడో చిత్రం ఇది. ఇప్పటివరకూ కల్యాణ్ రామ్ కు వచ్చిన విజయాలు రెండు. అందులో ఒకటి అతనొక్కడే కాగ, మరొకటి హరే రామ్. ఈ రెండు చిత్రాలు ఎన్.టి.ఆర్ ఆర్ట్స్ బానర్ నుంచి రావటం గమనార్హం. తాజా చిత్రం కూడా ఎన్.టి.ఆర్ అర్త్స్ బ్యానర్ నుంచే వస్తుండటం విశేషం. నరేన్ అనే కొత్త దర్శకుడు ఈ చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయం అవుతున్నాడు. ఈ చిత్రం కూడా కల్యాణ్ రామ్ కి నిర్మాతగా, నటుడిగా మంచి విజయం ఇవ్వాలని ఆశిద్దాం. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 17 న విడుదల చిత్రానికి సన్నాహాలు చేస్తున్నారు.
No comments:
Post a Comment